
శేరిలింగంపల్లి, నిఘా 24 : శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో సందయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వారికి కంటి అద్దాలు, మందులను అందజేశారు. ఈ శిబిరానికి సందయ్య మెమోరియల్ ట్రస్టు చైర్మన్, శేరిలింగంపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మారబోయిన భిక్షపతి యాదవ్ హాజరై అవసరమైన వారికి కంటి అద్దాలను అందించారు. ఈ సందర్భంగా భిక్షపతి యాదవ్ మాట్లాడుతూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని పాటించడమే సందయ్య మెమోరియల్ ట్రస్ట్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకునే వ్యక్తులలో తాను ముందుంటానని తెలిపారు.
సేవ చెయ్యాలనే సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక రకంగా సేవ చేయవచ్చని, తమ ట్రస్టు ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలలో పేద ప్రజలకు సేవ చేస్తూ, వారి ఆశీస్సులు పొందుతున్నామని అన్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న దాదాపు 500 మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని, అవసరమైన వారికి తమ ట్రస్టు ఆధ్వర్యంలో శస్త్ర చికిత్సలు సైతం ఉచితంగా చేయిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వినోద్ రావు, నరసింహ చారి, కృష్ణ గౌడ్ ,సందీప్ గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎత్తరి రమేష్, సత్యనారాయణ సుధాకర్ ,సురేష్, సైదమ్మ ,అనూష, రాహుల్, రాజు తదితరులు పాల్గొన్నారు.
👌👌