
హైదరాబాద్ : రైస్ పుల్లింగ్ పేరుతో జరిగిన మరో భారీ మోసం బట్టబయలు అయ్యింది. అమాయకులను రైస్ పుల్లింగ్ పేరుతో నమ్మించి మోసం చేసిన వ్యక్తుల మోసాన్ని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి 18 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ముంబయికి చెందిన జితేష్ శాంతిలాల్ సోలంకి తన స్నేహితుడు సమీర్ రాయ్ కి 15 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. ఈ సంవత్సరం జనవరి లో డబ్బు ఆడిగేందుకు వెళ్లగా తన వద్ద మంచి డీల్ ఉందని రైస్ పుల్లింగ్ ద్వారా డబ్బులు వస్తాయని చెప్పాడు. రోసారం కంపెనీకి ఎస్వీ దేవ పనిచేస్తున్నాడని, 300 కోట్ల కమిషన్ వస్తుంది అని చెప్పాడు. దింతో తనకు తెలిసిన రాజ్ ఖాన్ వద్ద రైస్ పుల్లింగ్ ఉందని చెప్పి సమీర్ కు పరిచయం చేశాడు. కాగా ఎస్వి దేవా, సమీర్ రాయ్, రాజ్ ఖాన్ లు కలిసి శాంతిలాల్ ను మోసం చేయాలని పథకం వేశారు. ఇందులో భాగంగా నలుగురు కలిసి పెట్టుబడి పెడుదామని శాంతిలాల్ ను నమ్మించారు. వీరిని నమ్మిన శాంతిలాల్ 18లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న తరువాత ముగ్గురు తప్పించుకు తిరుగుతుండడంతో ఈ నెల 7న శాంతిలాల్ గచ్చిబౌలి పోలీసులు కు పిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశాఖపట్నంకు చెందిన ఎస్వి దేవను అరెస్ట్ చేసి 18 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.