
శేరిలింగంపల్లి, ఈ కబురు: ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి కేసులు నమోదైన వాహనదారులకు రాయదుర్గం పోలీసులు మెగా లోక్ అదాలత్ తో కేసుల పరిష్కారానికి అవకాశం కల్పిస్తున్నారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనం నడిపి పోలీసులకు పట్టుబడి కేసులు నమోదైన వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాయదుర్గం ట్రాఫిక్ పోలీసు స్టేషన్ ఇనిస్పెక్టర్ శ్రీనాథ్ సూచించారు. రాజేంద్రనగర్ కోర్టు మెజిస్ట్రేట్ రణోజిని కలిసి రాయదుర్గం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నమోదైన కేసులతో పాటు ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల వివరాలను వెల్లడించినట్టు ఇనిస్పెక్టర్ శ్రీనాథ్ తెలిపారు.

ఈ విషయమై సానుకూలంగా స్పందించిన మేజిస్ట్రేట్ మెగా లోక్ అదాలత్ ఏర్పాటుకు అంగీకరించారని అన్నారు. ఇప్పటికే ఈ మెగా లోక్ అదాలత్ ద్వారా 400పైచీలుకు కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. ఈ మెగా లోక్ అదాలత్ ఈ నెల 11వ తేదీ వరకు కొనసాగుతుందని, ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి కేసులు నమోదైన వాహనదారులు సత్వర పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.