
శేరిలింగంపల్లి : రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీగా రెవెన్యూ సిబ్బందిని బదిలీ చేశారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనలో భాగంగా సిబ్బందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శేరిలింగంపల్లి మండలంలో పనిచేస్తున్న విఆర్ఓ లను బదిలీపై శంషాబాద్ కు పంపించారు. శంషాబాద్ లో పనిచేస్తున్న విఆర్ఓ లను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. శేరిలింగంపల్లి కి చెందిన విఆర్ఓలు సత్యనారాయణ, గోపాల్, ప్రవీణ్ కుమార్, నాగేశ్వరరావు, మాణిక్యారావులను శంషాబాద్ కు బదిలీ చేశారు. శంషాబాద్ లో ప్రస్తుతం పనిచేస్తున్న విఆర్ఓలు విక్రమ్ రెడ్డి, సురేష్, మహేష్, చంద్రమోహన్, ఇంద్రసేన రెడ్డిలను శేరిలింగంపల్లి కి బదిలీ చేశారు. జిల్లాలో శేరిలింగంపల్లి, రాజేంద్ర నగర్, గండిపేట, శంషాబాద్ లలో పనిచేస్తున్న మొత్తం 28 మందిని బదిలీ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.