
హైదరాబాద్ : గచ్చిబౌలిలో నూతన మల్టీఫ్లెక్స్ పీవిఆర్ సినిమాస్ అందుబాటులోకి వచ్చింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ సర్కిల్ వద్ద కొత్తగా నిర్మించిన ప్రిస్టెన్ మాల్ లో పీవిఆర్ మల్టీఫ్లెక్స్ ను ఏర్పాటు చేశారు. 4 స్క్రీన్ లతో 946 సీటింగ్ కేపాసిటీతో ఈ థియేటర్ ను అందుబాటులో తీసుకు వచ్చారు. సోమవారం పీవిఆర్ తెలంగాణ రీజనల్ మేనేజర్ మంజిత్ సింగ్ ప్రారంభించారు. 36వేల చదరపు అడుగులలో బర్కో 4కె ప్రొటెక్షన్ సిస్టం, హార్క్ నెస్ సిల్వర్ స్క్రీన్, డాల్బీ ఆట్ మాస్ సౌండ్ సిస్టం, నెక్ట్స్ జనరేషన్ 3డీ టెక్నాలజీ వంటి అత్యాధునిక హంగులతో గచ్చిబౌలి పీవిఆర్ అందుబాటులో ఉందన్నారు.
