
శేరిలింగంపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ 8వ వర్దంతి కార్యక్రమాన్ని గచ్చిబౌలిలో శుక్రవారం నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఖాజాగుడలోని కార్యాలయంలో ఆచార్య జయశంకర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆచార్య జయశంకర్ చిత్ర పటానికి కార్పొరేటర్ సాయిబాబా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఆచార్య జయశంకర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు రాజు ముదిరాజ్, ధనరాజ్ నాయకులు రమేష్ గౌడ్, జగదీష్, నారాయణ,పాండు నాయక్,అనిల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.