
శేరిలింగంపల్లి, నిఘా 24 : ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి.. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకులు సిద్ధమయ్యారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నాయకులు కొత్తదారులు వెతుకుతున్నారు. గచ్చిబౌలి పరిధిలోని గోపన్ పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసి పెట్టుకున్న రైస్ కుక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రైస్ కుక్కర్ లు శేరిలింగంపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘునాథ్ యాదవ్ విగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి పరిధిలోని గోపనపల్లిలో ఓ ఇంట్లో భారీ ఎత్తున ఓటర్లకు పంచేందుకు రైస్ కుక్కర్లను సిద్ధం చేసి పెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు సదరు నివాసంపై దాడి చేసి 87 రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ రైస్ కుక్కర్ల మీద కాంగ్రెస్ పార్టీ నాయకుడు మారబోయిన రఘునాథ్ యాదవ్ ఫోటో ముద్రించి ఉండటం విశేషం. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్, నరసింహలను అదుపులోకి తీసుకున్న పోలీసులు రైస్ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు… ఓటర్లకు పంచేందుకు ఈ రైస్ కుక్కర్లను సిద్ధం చేసి పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు రైస్ కుక్కర్ల పంపిణీతో సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఘటనాస్థలిని మాదాపూర్ ఏసిపి శ్రీనివాస్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ జేమ్స్ బాబులు పరిశీలించారు.
Dear immortals, I need some wow gold inspiration to create.
This blog is a great source of intellectual entertainment. Ligaciputra77 always find something interesting to read here.
(74)
తాజా వార్తలు(2)
తెలంగాణ(2)
శేరిలింగంపల్లి నిఘా(144)
స్పెషల్ ఫోకస్(102)
హైదరాబాద్ నిఘా(110)
హోమ్
(74)
తాజా వార్తలు(2)
తెలంగాణ(2)
శేరిలింగంపల్లి నిఘా(144)
స్పెషల్ ఫోకస్(102)
హైదరాబాద్ నిఘా(110)
హోమ్
(74)
తాజా వార్తలు(2)
తెలంగాణ(2)
శేరిలింగంపల్లి నిఘా(144)
స్పెషల్ ఫోకస్(102)
హైదరాబాద్ నిఘా(110)
హోమ్
Dear immortals, I need some wow gold inspiration to create.
0