
శేరిలింగంపల్లి : వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వరికోల్ శ్రీమంతుడు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్, శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ లు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో కలిసి మొక్కను బహూకరించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. శేరిలింగంపల్లి ఇంచార్జిగా టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేసిన పోచంపల్లి ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలను పరిష్కరిస్తారని అభిప్రాయపడ్డారు.