
హైదరాబాద్ : గన్ తో కాల్చుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు మీదకు కారులో వచ్చిన వ్యక్తి వెంట తెచ్చుకున్న గన్ తో కాల్చుకున్నాడు. టిఎస్ 09 యుబి 6040 నంబర్ గల బిఎమ్ డబ్ల్యూ కారులో వచ్చి గన్ తో కాల్చుకున్నాడు. ట్యాంక్ బండ్ కు చెందిన ఫైజన్ అహ్మద్ గా పోలీసులు గుర్తించారు. వెంటనే స్పందించిన ఔటర్ పెట్రోలింగ్ పోలీసులు అంబులెన్సులో ఫైజన్ ను గచ్చిబౌలి కేర్ అసుపత్రి కి తరలించారు.
