
హైదరాబాద్, నిఘా24 : గ్రేటర్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు ప్రధాన పార్టీలకు తలనొప్పి గా మారుతుంది. టికెట్ దక్కడం లేదని నిన్న ఓ నాయకుడు పార్టీ కార్యాలయం ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకోగా, గురువారం మరో మహిళా నాయకురాలు ఆత్మహత్య కు యత్నించింది. బిజెపి పార్టీ నుంచి గత ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీచేసి ఓడిపోయిన నాచారం బీజేపీ నాయకురాలు విజయలత రెడ్డి గురువారం ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఎన్నికల్లో సైతం ఆమె బీజేపీ నుండి టికెట్ ఆశించింది. కాగా టిక్కెట్ ఇతరులకు కేటాయించారని సమాచారం అందడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా, ప్రస్తుతం కొలుకుంటుంది.