
హైదరాబాద్, నిఘా 24: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఇనిస్పెక్టర్ గా ఎం. తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న తిరుపతిని రాయదుర్గం ఎస్ హెచ్ వోగా బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇనిస్పెక్టర్ గా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ రవీందర్ గత ఆరు నెలల క్రితం బదిలీపై సైబరాబాద్ కమిషనరేట్ వెళ్లగా, అప్పటి నుంచి డిటెక్టివ్ ఇనిస్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి ఇన్చార్జి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొత్త ఎస్ హెచ్ ఓగా తిరుపతి నియమితులు కావడంతో రాజగోపాల్ రెడ్డి డిఐగా కొనసాగనున్నారు. ఐటీ కారిడార్ భద్రత, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి.. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటామని నూతన సీఐ తిరుపతి తెలిపారు.