
హైదరాబాద్ : మైహోం అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నందగిరి హిల్స్‌లోని రామేశ్వరరావు ఇంట్లో, మాదాపూర్ లోని మై హోం కార్యాలయంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. సోదాల్లో దాదాపు 100 మందికిపైగా అధికారులు పాల్గొంటున్నారు. ఇళ్లు, కార్యాలయంలో పలు కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణలో అధికార పార్టీకీ అత్యంత సన్నిహితంగా ఉన్న రామేశ్వర రావు మీద ఐటీ దాడులు జరగడం సంచలనం సృష్టిస్తోంది.