
హైదరాబాద్ : శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి సర్వేనెంబర్ 127 లో గల కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా మ్యుటేషన్ చేసిన ఎమ్మార్వో ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. గతంలో శేరిలింగంపల్లి ఎమ్మార్వో గా శ్రీనివాసరెడ్డి పనిచేసిన కాలంలో తన విధులను దుర్వినియోగం చేసి ఎంపీ రేవంత్ రెడ్డి సోదరులకు మ్యుటేషన్ చేసినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రంగారెడ్డి కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. గోపన్ పల్లిలో గల సర్వేనెంబర్ 127 లో ఎంపీ రేవంత్ రెడ్డి సోదరుల పేరుతో ఆరు ఎకరాల భూమి ఉన్న విషయం తెలిసిందే. శేరిలింగంపల్లి లో పనిచేసి వెళ్లిన ఎమ్మార్వో ఇక్కడి లావాదేవీల కారణంగా సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది.
8 Comments