
హైదరాబాద్, నిఘా 24 : అటిజంతో బాధపడుతున్న చిన్నారులకు ఉత్తమ సేవలు అందిస్తున్న వివిధ వర్గాలకు చెందిన వారికి మామ్ అవార్డ్స్ 2023 ను అందజేశారు. ప్రముఖ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ ఆధ్వర్యంలో సోమవారం గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ లో బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు మెరుగైన సేవలు అందిస్తున్న డాక్టర్లకు, ఆటిజం సెంటర్లకు, మాతృమూర్తులకు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి మాతృమూర్తులు క్యాట్ వాక్ తో ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి హాజరై బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రముఖ హోమియోపతి డాక్టర్ ఏఎం.రెడ్డి, నటి సనా, నటుడు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
