
హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్ కు చెందిన 2వ తరగతి చదువుతున్న 7 సంవత్సరాల చిన్నారి పై మరో వృద్ద మానవ మృగం అత్యాచారానికి యత్నించాడు. ఇంటి పక్కన వుండే వేంకటయ్య అనే వృద్ద కామాంధుడు ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని భవనంపైకి తీసుకెళ్ళి అత్యాచారానికి ఒడిగట్టే ప్రయత్నం చేసాడు. పక్క భవనంలోని 2వ అంతస్థులో నివాసం వుండే వ్యక్తి గమనించి అరవడంతో చిన్నారిని వదిలిపెట్టిన కామాంధుడు అక్కడినుంచి పరారయ్యాడు. కాగా స్థానికులు కామాంధుడిని పట్టుకుని కరెంటు స్తంభానికి కట్టి, దేహశుద్ది చేసి జవహార్ నగర్ పోలీసులకు అప్పజెప్పారు.