
శేరిలింగంపల్లి, నిఘా 24 : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గురువారం మదీనగూడ రామకృష్ణ నగర్ కాలనీ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ మహోత్సవంలో రామకృష్ణ నగర్ కాలనీ తో పాటు పరిసర ప్రాంతాల వాసులు వేలాదిగా పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ హాజరై సీతారాములకు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. సాయంత్రం కాలనీ పురవీధుల్లో నిర్వహించిన సీతారామచంద్రుల శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డి. మోహన్ జి. వీర రాజు, తిమ్మారెడ్డి, జె విజయ్ కుమార్, వి సత్యనారాయణ, రామకృష్ణ, కృష్ణారావు, పి లావణ్య, ఎం పద్మ ఇతర కాలనీ పెద్దలు పాల్గొన్నారు.