
హైదరాబాద్, నిఘా 24 : మాదాపూర్ ఓయో హోటల్ లో ఏం జరిగింది అనే విషయం అంతుపట్టకుండా మారింది. హోటల్ కు వచ్చిన యువకుడు అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరగా, తెల్లవారే సరికి యువకుడితో పాటు వచ్చిన యువతి హోటల్ గదిలో అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. హైటెక్ సిటీ మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై అంబటూర్ కు చెందిన శ్రీహరిరమేష్(25) తమ కుటుంబానికి చెందిన రాఘన ఎంటర్ప్రైజెస్ బిజినేస్ పనులు చూసుకుంటున్నాడు. పుదుచ్ఛేరి రాష్ట్రానికి చెందిన ఎస్.శ్రావణప్రియ(25)తో కలిసి శ్రీహరి చెన్నై లో ఇంటర్మీడియట్ చదువుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు మంచి స్నేహితులు. శ్రావణ ప్రియ హైదరాబాద్ కు వచ్చి జడ్చర్లలోని హెటిరో కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. రెండు రోజుల క్రితంస్నేహితులను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన శ్రీహరి స్నేహితులతో కలిసి గోల్కోండకు వెళ్ళాడు. శ్రావణ ప్రియ అక్కడే ఉండడంతో ఫోన్ చేశాడు. ఇద్దరు కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో శ్రీహరి మంగళవారం సాయంత్రం 6 గంటలకు మాదాపూర్ అయ్యప్పసొసైటీ రోడ్డు నెం.36లోని గోల్డెన్ హైవ్ ఓయో హోటల్లో రూమ్ బుక్ చేశాడు. డ్యూటీ ముగిసిన రాత్రి 9 గంటలకు శ్రావణప్రియ హోటల్ రూమ్‌కు వచ్చింది. ఇద్దరు కలిసి రాత్రి హోటల్ గదిలోనే మద్యం తాగారు. మధ్యరాత్రి శ్రీహరికి వాంతులు కావడంతో దగ్గరిలోకి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. హోటల్ గదిలోనే ఉన్న శ్రావణ ప్రియ బుధవారం ఉదయం జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకుంది. 10 గంటల ప్రాంతంలో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు డెలివరీ బాయ్ రూమ్ దగ్గరకు వెళ్లగా ఎంతకూ తలుపు తీయకపోవడంతో డెలివరీ బాయ్ పార్సిల్ ను రిసెప్షన్ లో ఇచ్చి వెళ్లాడు.
మధ్యాన్నం 2.30కు హాస్పిటల్ నుంచి హోటల్ కు వచ్చిన శ్రీహరి తమ రూమ్ కు వెళ్లి డోర్ తెరిచాడు. గదిలో శ్రావణ ప్రియ చలనం లేకుండా నేలపై కుర్చొని ఉంది. వెంటనే శ్రీహరి అంబులెన్స్ ను పిలిపించగా, కిందకు తీసుకువచ్చి పరిశీలించిన అంబులెన్స్ సిబ్బంది అప్పటికే శ్రావణ ప్రియ మృతిచెండినట్టు చెప్పారు. హోటల్ సిబ్బంది మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలను సేకరించారు. రూంలో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. యువతి స్నేహితుడు శ్రీహరిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Dear immortals, I need some wow gold inspiration to create.