
శేరిలింగంపల్లి, నిఘా24: మాదాపూర్ లెమన్ ట్రీ హోటల్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రియుడు తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు వికారాబాద్ జిల్లా బొమ్మరాజు పేటకు చెందిన సంతోషి(25), రాములు(25) గా గుర్తించారు. హోటల్ గదిలోని బాత్ రూమ్ లో ప్రియురాలు సంతోషి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ప్రియుడు రాములు గదిలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని తాను ఆత్మహత్య చేసుకున్నాడు. లెమన్ ట్రీ హోటల్ కు చేరుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.