
హైదరాబాద్ : మాదాపూర్ సీఐ వెంకట్ రెడ్డి పై వేటు పడింది. ప్రైవేట్ భూముల వివాదంలో తలదూర్చిన మాదాపూర్ సిఐ, వెంకటరెడ్డిని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీచేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ సివిల్ వివాదంలో సీఐ వెంకట్ రెడ్డి తలదూర్చడం వివాదాస్పదమైంది. విషయం సైబరాబాద్ కమిషనర్ వద్దకు చేరడంతో ఈ మేరకు కమిషనర్ శనివారం సీఐ వెంకట్ రెడ్డిని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
