
శేరిలింగంపల్లి, నిఘా24: మాదాపూర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ అభ్యర్థిగా గంగల రాధాకృష్ణ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మాదాపూర్ నుంచి బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ కు తరలివచ్చారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం రాధాకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో మాదాపూర్ గడ్డపై బిజెపి జెండా ఎగురవేయడం ఖాయమన్నారు. ఎన్నో సంవత్సరాలుగా తాము ప్రజా జీవితంలో ఉన్నామని, మాదాపూర్ డివిజన్ పరిస్థితులపై తమకు పూర్తి అవగాహన ఉందన్నారు. తన తండ్రి గంగల నరసింహ యాదవ్ సైతం ఎన్నో సంవత్సరాలుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారని గుర్తు చేశారు. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో డివిజన్ పరిధిలోని బిజెపి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ విజయ ఢంకా మోగిస్తామని పేర్కొన్నారు. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో శుక్రవారం డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
