
హైైైదరాబాద్ : ఓ వైపు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండగా మిడతల దండు రూపంలో మరో ప్రమాదం ముంచుకొస్తుంది. ఇప్పటికే దేశంలోని మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించిన మిడతల దండు గురువారం తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతల దండు కనిపించినట్టు తెలుస్తుంది. తెలంగాణ లోని నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పాక్ నుంచి భారత్ దూసుకు వచ్చిన మిడతల దండు దేశంలోని లక్షల ఎకరాల్లో పంటలను నాశనం చేసిన విషయం తెలిసిందే. మిడతలు కనిపిస్తే వెంటనే కిసాన్ మిత్ర కాల్ సెంటర్ 1800 425 1110కు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. పంటపొలాలు ఉన్న రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
▶️ఖాళీ డబ్బాలు, ప్లేట్లతో శబ్దాలు చేస్తే మిడతల పరిపోతాయి.
▶️ఎలక్ట్రానిక్ వస్తువులు (సౌండ్ బాక్సులు, డిజె )ల శబ్దాలకు మిడతలు ఉండవు.
▶️పొగ పెట్టినా మిడతలు పారిపోతాయి.
▶️పటాకులు, సుతిల్ బాంబుల శబ్దానికి మిడతలు వెళ్లిపోతాయి.
▶️15 లీటర్ల నీటిలో 45 మిల్లిలిటర్ల వేపనునే ను కలిపి పంటలపై చల్లితే మిడతలు పంటలను తినవని, దీని వల్ల పంటకు ఎటువంటి నష్టం ఉండదని చెప్తున్నారు.
▶️పొలంలో ఉన్న జిగురు మట్టిని నీళ్లలో కలిపి పంటపై పిచికారీ చేయడం ద్వారా పంటపై మిడతలు వాలవని, దీని ద్వారా పంటకు బలం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.