
శేరిలింగంపల్లి: కొత్తగూడ గణనాథుడికి సోమవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి మాజీ కార్పొరేటర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నీలం రవీందర్ ముదిరాజ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రిని రవీందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానికులు సన్మానించారు. కార్యక్రమంలో స్థానికులు, ఎన్ఆర్ఎం యువసేన సభ్యులు పాల్గొన్నారు.