
హైదరాబాద్ : కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీ చైతన్య కళాశాల హాస్టల్లో విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయింది. సోమవారం రాత్రి హాస్టల్ లో ఉంటున్న సుమారు 22 మంది విద్యార్థినులు అన్నం తిన్నాక కొద్దిసేపటికే వాంతులు చేసుకున్నారు. దీoతో కళాశాల యాజమాన్యం వెంటనే డాక్టర్లను పిలిపించి చికిత్స చేయించారు. వీరితో పాటు మరో 50 మంది విద్యార్థినులు కూడా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దింతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇంటికి తీసుకొని వెళ్లారు. ఈ సంఘటనపై కళాశాల యాజమాన్యంను వివరణ కోరగా విద్యార్థులకు వైరల్ ఫీవర్ వచ్చిందని చెబుతున్నారు.
