
శేరిలింగంపల్లి, నిఘా24: కొండాపూర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ రెబెల్ అభ్యర్థిగా మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. తన అనుచరులు, కొండాపూర్ స్థానికులతో కలిసి తన నామినేషన్ సమర్పించారు. డివిజన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ కొండాపూర్ డివిజన్ ప్రజల అభిష్టానానికి అనుగుణంగా అభ్యర్థి ఎంపిక జరగలేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ప్రజాజీవితంలో ఉన్నానని గతంలో కార్పొరేటర్ గా ఎటువంటి పక్షపాతం, మచ్చ లేకుండా పని చేశానని గుర్తు చేశారు. కొండాపూర్ డివిజన్ ప్రజల అభీష్టం మేరకు , తన అనుచరుల ఒత్తిడి మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
