
హైదరాబాద్, నిఘా24; తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటి.రామారావు జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రికి నూతన అంబులెన్స్ ను అందజేశారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా కొమిరిశెట్టి ఫౌండేషన్ నిర్వాహకులు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో టిమ్స్ ఆసుపత్రికి నూతన అంబులెన్స్ ను అందజేశారు. శనివారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపుడి గాంధీ చేతులు మీదగా టిమ్స్ ఆసుపత్రి అధికారులకు అంబులెన్స్ ను అందజేశారు.

అనంతరం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు జ్ఞానేశ్వర్, మణిక్ రావు, సహదేవ్, రాజు,వేణు, మురళీ, హరికాంత్, వినయ్, శివకాంత్ లతో పాటు స్థానిక నాయకులు, ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.
