
శేరిలింగంపల్లి, నిఘా24: రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో గచ్చిబౌలి ఖాజాగూడకు చెందిన కొమరగౌని విపిన్ గౌడ్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటాడు. జిల్లాస్థాయి, జాతీయస్థాయిలో నిర్వహించిన చాంపియన్ షిప్ లో పతకాలు సాధించి అబ్బురపరిచాడు. రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో కొమరగౌని విపిన్ గౌడ్ మొదటి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ ను సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు ట్రై సిటీలో నిర్వహించిన 58వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించిన కొమరగౌని విపిన్ గౌడ్ మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించాడు. రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్ లో గచ్చిబౌలికి చెందిన కొమరగౌని విపిన్ గౌడ్ గోల్డ్, బ్రాంజ్ పథకాలు సాధించడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రోలర్ స్కెటింగ్ లో మరింతగా సత్తాచాటి, జాతీయ స్థాయిలో రాణిస్తానని విపిన్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
