
హైదరాబాద్, నిఘా24: కోకాపేట భూముల వేలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపించింది. గురువారం నిర్వహించిన వేలంలో కోకాపేటలోని నియో పోలీస్ భూములు అత్యధిక ధర పలికి సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. మొత్తం 49.949 ఎకరాల ఈ భూముల వేలం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2000.37 కోట్లను సమకూర్చుకుంది. వేలంలో 60 మంది బిడ్డర్లు పాల్గొనగా, కేవలం 6 సంస్థలు భూములు దక్కించుకున్నాయి. నియో పోలీస్ లోని మొత్తం 8 ప్లాట్లను 25 కోట్ల అప్సెట్ ధరతో వేలం లో ఉంచగా, అత్యధికంగా ఒక ఎకరా 60.2 కోట్ల ధర పలుకగా, అత్యల్పంగా 31.2 కోట్ల ధర పలికింది.
భూములు దక్కించుకున్న సంస్థలు…
నియో పోలీస్ లోని ప్లాట్ 1లో ఉన్న 7.721 ఎకరాలను 42.2 కోట్లకు ఎకరాల చొప్పున 325.83 కోట్లతో మన్నె సత్యనారాయణ రెడ్డి వేలంలో దక్కించుకున్నారు. 2 ఫ్లాట్ లోని 7.755 ఎకరాలను 42.4 కోట్లకు ఎకరా చొప్పున 328.81 కోట్లకు రాజపుష్ప సంస్థ సొంతం చేసుకుంది. దీంతోపాటు వెస్ట్ పార్ట్ టు పి ప్లాట్ లో ఉన్న 1.65 ఎకరాలను 60.2 కోట్లకు ఎకరాల చొప్పున రాజపుష్ప దక్కించుకుంది. 3 ఫ్లాట్ లో ఉన్న 7.738 ఎకరాలను 36.4 కోట్లకు ఎకరాల చొప్పున, 4 ప్లాట్ లో ఉన్న 8.946 ఎకరాలను 39.2 కోట్లకు ఎకరా చొప్పున ఆక్వా స్పేస్ దక్కించుకుంది. 12ఫ్లాట్ లో ఉన్న 7.564 ఎకరాలను 37.8 కోట్లకు ఎకరా చొప్పున ప్రెస్టేజ్ సంస్థ… 13వ ప్లాట్ లోని 7.575 ఎకరాలను 39.2 కోట్లకు ఎకరా చొప్పున వర్సిటీ సంస్థ… A ఫ్లాటులో ఉన్న 1 ఎకరాను 31.2 కోట్ల చొప్పున హైమా సంస్థ సొంతం చేసుకుంది.
