
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో శనివారం కరోనా కొత్త కేసులు కేవలం 7 నమోదయ్యాయి. శుక్ర, శనివారాల్లో కరోనా కేసులు తక్కువగా నమోదు కావడంతో తెలంగాణ లో వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తుంది. శనివారం 7 కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 990కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 658 ఆక్టివ్ కేసులు ఉండగా, 307మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. మరో 25 మంది వ్యాధి కారణం గా మృతి చెందారు. శనివారం నమోదైన 7 కేసుల్లో 6 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. మరో కేసు వరంగల్ లో నమోదైంది.