
నిఘా24 ప్రతినిధి : ఓ వైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం పేరుతో మొక్కలు నాటాలని, పచ్చదనం పెంచాలని పిలుపునిస్తుండగా, మరోవైపు కొంతమంది పచ్చటి చెట్లపై గొడ్డలి వేటు వేస్తూ ఎడాపెడా చెట్లను నరికివేస్తున్నారు. వీరికి కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల అండదండలు లభిస్తుండడంతో లేఅవుట్ల కోసం పచ్చటి చెట్లు నెలకోరుగుతున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ గ్రామంలో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం. గ్రామానికి అనుకొని పచ్చటి చెట్లతో కళకళలాడుతున్న భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించేందుకు కొంతమంది రియల్టర్లు భారీ ఎత్తున చెట్లను నరికివేశారు. దుర్షేడ్ గ్రామం సర్వే నెంబర్ 180/పి లో ఉన్న దాదాపు 45 తాటి చెట్లు, మర్రి చెట్లను గతనెల రాత్రికి రాత్రే కొంతమంది నరికివేసి భూమిని చదును చేశారు. ఊరికి అనుకొని ఉన్న భూమిలో భారీ వృక్షాలను ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా నరికివేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ విషయమై గ్లోబల్ ట్రీస్ ప్రొటెక్షన్ అనే సంస్థ, స్థానికులు పిర్యాదు చేయడంతో రూరల్ అటవీశాఖ అధికారి వచ్చి విచారణ చేపట్టారు. కానీ రాజకీయ ఒత్తిళ్లతో, స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో విచారణ నిలిచిపోయింది. దీనితో ఇదే అలుసుగా రియల్టర్లు మరిన్ని చెట్లను భారీ ఎత్తున తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దుర్షేడ్ చెట్ల నరికివేతపై చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.



ラブドール 挑発的なラブドールをみんなから保管して隠す方法