
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా నియమితులైన పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టియుడబ్ల్యుజె) రంగారెడ్డి జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్ సాగర్ ఆధ్వర్యంలో మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మాసగళ్ల లక్ష్మణ్, కోశాధికారి పిండిగ వెంకన్న, ఉపాద్యక్షులు గంట్ల రాజిరెడ్డి, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ రమేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందర్, ఉప్పు సత్యనారాయణ, జిల్లా క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బొక్క బాల్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు రాజ్ కుమార్, యూనియన్ నాయకులు సుమన్, చంద్రశేఖర్, వెంకటేష్, రాఘవేందర్, నర్సింహ్మ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
2 Comments