
హైదరాబాద్ : గచ్చిబౌలి ఐటీ కారిడార్ లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా రహదారులపై వరద నీరు నిలిచి పోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అసలే సాయంత్రం ట్రాఫిక్ రద్దీకి తోడు రహదారిపై వాననీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. ట్రాఫిక్ పోలీసులు వాన నీటిలోనే విధులు నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో మురుగు నీరు రహదారులను ముంచెత్తడంతో పాటు ఇళ్లలోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు.