
హైదరాబాద్, నిఘా 24 : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరసిస్తూ ఐటి ఉద్యోగులు హైటెక్ సిటీలో ఆందోళన చేపట్టారు. మాదాపూర్ సైబర్ టవర్స్ వద్దకు చేరుకున్న పలువురు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ‘వి అర్ విత్ యూ సీబీఎన్’ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ఉద్యోగులు రెండవ రోజు తమ ఆందోళనను కొనసాగించారు. ఆందోళన చేపట్టిన ఐటి ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ బుధవారం హైటెక్కెటీ పరిధిలో భారీ ఎత్తున ఐటి ఉద్యోగులు ఆందోళనకు పూనుకోవడంతో గురువారం ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐటి కారిడార్ కావడం, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పెద్దఎత్తున బలగాలను మోహరించి భద్రతను పర్యవేక్షించారు. కాగా సాయంత్రం సమయంలో పలువురు ఐటి ఉద్యోగులు, ఇతరులు సైబర్ టవర్స్ వద్ద ఆందోళనకు దిగగా, వెంటనే స్పందించిన పోలీసులు వారిని ఆదువులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు ఎన్నో ఐటి సంస్థలను నగరానికి తీసుకువచ్చి, నగరంలో ఐటి రంగం అభివృద్ధికి బాటలు వేశారని, అటువంటి నాయకుడి మీద అవినీతి మరకలు అంటించేందుకు ప్ర యత్నిస్తూ ఆక్రమంగా జైలుకు పంపించారని పలువురు ఉద్యోగులు నినదించారు. చంద్రబాబు అరెస్టు ఆక్రమమని, వెంటనే ఆయన మీద పెట్టిన కేసులను ఎత్తివేసి, చంద్రబాబును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. కాగా సైబర్ టవర్స్ చౌరస్తా వద్ద ఐటి ఉద్యోగులు ఆందోళన చేసే అవకాశం ఉందని ముందస్తు సమాచారం ఉండడంతో పోలీసులు ఉదయం నుంచే భారీ ఎత్తున ప్రత్యేక బలగాలతో బందోబస్తు చేపట్టారు. సాయంత్రం ఆందోళన చేపట్టేందుకు వచ్చిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
nice information 👍