
హైదరాబాద్ : నగరంలో గత 15 రోజుల క్రితం జరిగిన ఓ బర్త్ డే పార్టీ కరోనా హాట్ స్పాట్ గా మారినట్టు సమాచారం అందుతోంది. ఈ పుట్టిన రోజు పార్టీకి హాజరైన నగరానికి చెందిన ప్రజాప్రతినిధితో సహా 20 మంది నగరంలోని వ్యాపారులు, ప్రముఖులకు వ్యాధి సోకినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతో పాటు వేడుకలు నిర్వహించిన బంగారు వ్యాపారి, మరో ప్రముఖ వ్యాపారి రెండు రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయినట్టు తెలుస్తుంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన… హిమాయత్ నగర్ లో ఉండే ఓ బంగారు ఆభరణాల వ్యాపారి 15 రోజుల క్రితం బర్త్ డే పార్టీ ఇవ్వగా, వేడుకలకు నగర ప్రజాప్రతినిధితో పాటు 150మంది ప్రముఖులు, వ్యాపారులు హాజరైనట్టు సమాచారం. వేడుకల్లో పాల్గొన్న నగరానికి చెందిన ప్రజాప్రతినిధితో పాటు 20 మందికి కరోనా సోకగా, వేడుకలు ఏర్పాటు చేసిన వ్యాపారి, మరో వ్యాపారి రెండు రోజుల క్రితం చనిపోయినట్టు తెలుస్తుంది. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు ఉండడంతో అధికారులు విషయాన్ని గోప్యంగా ఉంచారని సమాచారం.
9 Comments