
శేరిలింగంపల్లి, నిఘా 24: హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్టు హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీకి చెందిన మనోహరి చారి కుమార్తె వివాహాన్ని పురస్కరించుకుని హోప్ ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ దంపతులు పుస్తె మెట్టలను అందజేశారు. గురువారం చందానగర్ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయంలో వధువు తల్లితండ్రులకు కొండా విజయ్ కుమార్ దంపతులు పుస్తె మెట్టెలను అందించారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆద్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఏన్నో సేవా కార్యక్రమాలు చేపట్టామని, వివాహా మహోత్సవానికి పుస్తె మెట్టలను అందచేయడం ఏంతో సంతోషంగా ఉందన్నారు. పేద విద్యార్థుల చదువుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో హోప్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని, చదువుతోనే యువత భవిష్యత్తు ఉత్తమంగా ఉంటుందని అన్నారు. తమ హోప్ ఫౌండేషన్ ఆద్వర్యంలో రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఫౌండేషన్ చైర్మెన్ కొండ విజయ్ కుమార్ తెలిపారు.
great 👌👌👌
Thankyou for this information.
Really good piece of writing. I thoroughly enjoyed the article. keep up the good work. You can use Chatgptnorsk for more idea about articles.
Thank you so much for sharing this post! Your insights are truly valuable, and I appreciate the effort you put into providing such helpful information. Visit chatgpt dansk for insights about more topics.