
శేరిలింగంపల్లి, నిఘా24 : ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యంగం మనకు కల్పించిన హక్కు ఓటు అని హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ తెలిపారు. ఓటుక హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఓటరు అవగాహణ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యం చేస్తూ రూపొందించిన కరపత్రాలను సోమవారం చందానగర్ లోని హోప్ ఫౌండేషన్ కార్యాలయం వద్ద పలువురు స్వచ్చంధ సేవకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యంగం మనకు కల్పించిన ఓటుహక్కుపై ప్రజల్లో అవగాహణ కల్పించేందుకు హోప్ పౌండేషన్ ఆద్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రస్తుతం 7 లక్షలకు పైగా ఓట్లతో అతిపెద్ద నియోజకవర్గంగా ఉందన్నారు. కానీ గతంలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ఇప్పటివరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఓటింగ్ శాతం యాబై శాతానికి మించి పెరగకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమన్నారు. దీనికి కారణాలు ఎన్ని ఉన్నా, ప్రజలు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఓటర్లకు అవగాహన కల్పించడం కోసం హోప్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, కరపత్రాలు, వాహన ప్రచారం ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మెధావులు, చదువుకున్న వారు, వివిధ రంగాల్లో కొనసాగుతున్న వారు ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ముఖ్యంగా నవంబర్ 30 తేదీన ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా హోప్ పౌండేషన్ చైర్మన్ కొండా విజయకుమార్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ తాడిబోయిన రామస్వామి యాదవ్, హోప్ పౌండేషన్ సభ్యులు గాలి కృష్ణ, మారం వెంకట్, రెడ్డి ప్రవీణ్ రెడ్డి, బిక్షపతిసాగర్, శంకర్ ముదిరాజ్, షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
Call young ladies in Lahore offer a scope of administrations customized to meet the different necessities and wants of their clients.