
శేరిలింగంపల్లి : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని HOPE ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు శనివారం గొడుగులు పంపిణీ చేశారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యలయంలో జోనల్ కమీషనర్ దాసరి హరిచందన, ఉప కమీషనర్ వెంకన్న చేతుల మీదుగా HOPE ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 150 మంది పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా HOPE ఫౌండేషన్ సేవలను జోనల్ కమిషనర్ హరిచందన కొనియాడారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశుద్ధ్య కార్మికులకు గొడుగులను అందచేయడం అభినందనీయమని ఉప కమీషనర్ వెంకన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు బిందుభార్గవి, సుభాష్, గీత, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఘాలి కృష్ణ, నక్క శ్రీను, విజయ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.