
శేరిలింగంపల్లి : వేసవిలో జీహెచ్ఎంసి శేరిలింగంపల్లి సర్కిల్ 20 ఉద్యోగుల దాహార్తిని తీర్చేందుకు హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటర్ కూలర్ ను అందజేశారు. హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ సోమవారం ఉదయం జోనల్ కమిషనర్ హరిచందన, డిప్యూటీ కమిషనర్ వెంకన్నలకు వాటర్ కూలర్ ను అందించారు. కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ సర్కిల్ సిబ్బందితో పాటు వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు వాటర్ కూలర్ ను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్కిల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.