
శేరిలింగంపల్లి : మే డే సందర్భంగా HOPE ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్ లో పనిచేస్తున్న కార్మికులను ఘనంగా సన్మానించారు. స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్ ఏజీఎం కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా HOPE ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్ కార్మికులకు స్వీట్ ప్యాకెట్లను అందించి సన్మానించారు. కార్మికుల దినోత్సవం రోజున కార్మికులను సన్మానించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ లెర్నింగ్ సెంటర్ అధికారులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.