
హైదరాబాద్, నిఘా24 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రానున్న 3 రోజులు హై అలెర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. అక్టోబర్ 12 నుంచి 14వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. జీహెచ్ఏంసీ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఎమర్జెన్సీ టీమ్ లను సిద్ధం చేయడం, వరద నీటిని తొలగించే మెషినరీ సిద్ధం చేయడం, లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని సూచిస్తూ జీహెచ్ఏంసీ ఇన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.