
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలి
– జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శివలింగయ్య
రామచంద్రాపురం, నిఘా 24 : రామచంద్రాపురంలోని శ్రీ వెంకన్న హీరో షోరూంలో మంగళవారం హీరో మోటోకార్ప్ కొత్తగా విడుదల చేసిన ఎక్స్–టెక్ సిరీస్ టూ వీలర్లను పటాన్చెరు ఎంవీఐ రాజా మెహమ్మద్తో కలిసి సంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శివలింగయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శివలింగయ్య మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించినప్పుడే వ్యాపార సంస్థలకు మంచి పేరు వస్తుందని అన్నారు. ఆర్టీఏ రూల్స్ పాటిస్తూ వాహనాలను నడపడం ఎంత ముఖ్యమో, వాహనాలను విక్రయించే షో రూంలు కూడా నిబంధనలను అనుసరించాలని సూచించారు. ప్రతి వెహికిల్తో హెల్మెట్, ఇన్సురెన్స్ తప్పక అందించాలన్నారు.

అనంతరం వెంకన్న షో రూం డైరెక్టర్ కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దసరా, దీపావళి పండగలను పురస్కరించుకొని వెంకన్న షో రూంలో వాహనాలు కొనే కస్టమర్లకు రూ. 13500 వరకు ఆఫర్స్ అందిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు ప్రతి వినియోగదారుడికి స్థానికంగా ఉన్న రాపిడ్ డయాగ్నస్టిక్ సెంటర్లో రూ. 700 విలువ గల పరిక్షలు ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. హీరో మోటోకార్ప్ కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్–టెక్ సీరీస్ వాహనాలలో బ్లూ టూత్ కనెక్టివిటీ, డిజిటల్ మీటర్, స్టాండ్ బై సైడ్ స్టాండ్ ఇంకా ఇతర ఫీచర్లు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ శ్రీపాద శ్రీనివాస్, సిబ్బంది నవీన్, అభినవ్, రవి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.
