
హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ ఎఎస్ఏ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఏ, డిఎస్ యు, టిఎస్ఎఫ్ లు ఒక కూటమిగా ఏబీవీపీ, ఓబిసిఎఫ్, ఎస్ఎల్ విడి లు మరో కూటమిగా బరిలో నిలిచాయి. ఎస్ఎఫ్ఐ కూటమి నుంచి పోటీచేసిన అభిషేక్ నందన్ తన ప్రత్యర్థి ఏబివిపి కి చెందిన ఫణి కృష్ణ మీద 1146 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వీరితోపాటు ఉపాధ్యక్షుడిగా ఎస్ఎఫ్ఐ కూటమికి చెందిన శ్రీ చరణ్, ప్రధాన కార్యదర్శిగా గోపి స్వామి, సంయుక్త కార్యదర్శిగా రాథోడ్ ప్రదీప్, సాంస్కృతిక కార్యదర్శిగా ప్రియాంక భద్ర శెట్టి, క్రీడా కార్యదర్శిగా సోహెల్ అహ్మద్ లు విజయం సాధించారు.
