
హైదరాబాద్ : దేశంలోని అత్యుత్తమ యూనివర్సిటీల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నెంబర్ -2 ర్యాంక్ ను సొంతం చేసుకుంది. ఇండియా టుడే మ్యాగజైన్ 2019 ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండవ స్థానంలో నిలిచింది. దేశంలోని టాప్ 36 యూనివర్సిటీల్లో ఢిల్లీ జె ఎన్ యూ మొదటి ర్యాంకు లో నిలిచింది. ఇండియా టుడే ర్యాంకింగ్స్ లో 2017లో 5వ ర్యాంక్, 2018లో 3వ ర్యాంక్ సాధించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2019లో 2వ ర్యాంక్ సొంతం చేసుకుంది.