
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన్ డే లీగ్ లో శేరిలింగంపల్లికి చెందిన గంగల రిషికేశ్ యాదవ్ సత్తా చాటాడు. ఖాజాగుడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న రిషికేశ్ తన టీమ్ ఋషిరాజ్ తరపున బరిలో దిగి బౌలింగ్ లో మెరుపులు మెరిపించాడు. హబ్సిగూడలో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి వీపీ విల్లోమాన్ బ్యాటింగ్ లైనప్ ను కుప్పకూల్చాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 18 పరుగులే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు.