
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్లలో పలు అభివృద్ధి పనులుకు గురువారం స్థానిక కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, పూజితా జగదీశ్వర్ గౌడ్ లతో కలిసి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని మాతృశ్రీ నగర్ , ఆదిత్యనగర్ , ఇజ్జత్ నగర్, జైహింద్ ఎనక్లేవ్ , అరుణోదయ కాలనీ, ఖానమేట్ తదితర ప్రాంతాల్లో సుమారు 337.60 లక్షల రూపాయలతో, హాఫిజ్ పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ, నందిని నగర్, వైశాలి నగర్, శాంతి నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 301.40 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరిన్ని నిధులు మంజూరు చేయించి ఈ ప్రాంతాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
2 Comments