
హైదరాబాద్, నిఘా24: ఐటీ కారిడార్ కు కూతవేటు దూరంలోని గోపన్ పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. హత్య జరిగి మూడు, నాలుగు రోజులు అవుతున్నట్టు బావిస్తుండగా, దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మహబూబ్ నగర్ కు చెందిన మహిళ 4,5 సంవత్సరాలుగా గోపన్ పల్లి ఎన్టీఆర్ నగర్ లో నివాసం ఉంటుంది. గత మూడు, నాలుగు రోజులుగా కనిపించకుండా పోగా, మహిళ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు వెళ్లి చూశారు. ఇంట్లో కుళ్లిన స్థితి లో మహిళ మృతదేహం ఉండగా, పరిసరాలను బట్టి మహిళపై అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాన్ని స్వాదినం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.