
శేరిలింగంపల్లి : గోపాన్ పల్లి ఎన్టీఅర్ నగర్ లో ఓ వ్యక్తి తన భార్య, కుమారుడి ని దారుణంగా హత్య చేసాడు. అనంతరం తాను ఆత్మహత్య కు యత్నించాడు. కర్నాటక రాష్ట్రానికి చెందిన చిన్నా గోపన్ పల్లిలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతిగా మద్యం తాగుతున్నాడని ఉద్యోగంలో నుంచి కొన్ని రోజుల క్రితం తొలగించారు. కాగా బుధవారం చిన్నా తన భార్యను, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య కు యత్నించాడు. ప్రస్తుతం చిన్నా కంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.