
శేరిలింగంపల్లి, నిఘా24: ఐటీ కారిడార్ పరిధిలో గణపయ్య లడ్డు లక్షల్లో ధర పలుకుతుంది. గోపన్ పల్లిలో ఏర్పాటు చేసిన గణనాథుడి లడ్డు భారీ పోటీ మధ్య 2.80లక్షల ధర పలికింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపన్ పల్లిలో ఈదమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధల మధ్య శనివారం నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జనానికి ముందు భక్తుల పూజలందుకున్న లడ్డు వేలం పాట నిర్వహించారు. పోటా పోటీగా సాగిన ఈ వేలం పాటలో గణపయ్య లడ్డును 2,80,001 రూపాయలకు గోపన్ పల్లికే చెందిన ఇరగదిండ్ల సుమన్ సొంతం చేసుకున్నారు. వేలంలో లడ్డును సొంతం చేసుకున్న సుమన్ ను సన్మానించిన ఆలయ కమిటీ గణపయ్య లడ్డును అందజేశారు.