
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో కొత్తగా ఏర్పాటు చేసిన గోదావరి కట్స్ లైవ్ నాన్ వెజ్ ఔట్ లెట్ ను శనివారం ప్రారంభించారు. మాంసాహార ఉత్పత్తులను మొత్తం ఒకే వేదిక మీద అందుబాటులో ఉంచిన గోదావరి కట్స్ ఔట్ లెట్ ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా గోదావరి కట్స్ చైర్మెన్ నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… వ్యాపారంలో నాణ్యత, శుభ్రత ఎంతో ప్రాధాన్యం అని, ఆ ఏజెండా తోనే నాల్గవ బ్రాంచ్ ప్రారంభించామన్నారు. గతంలో నాన్ వెజ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు మహిళలు ఇబ్బందులు పడేవారని, దీన్ని దృష్టిలో పెట్టుకొని వాక్ ఇన్ తరహాలో తమ ఔట్ లెట్ ఏర్పాటు చేశామన్నారు. తమ స్టోర్ లో చికెన్, మటన్, ఫిష్ సంబంధిత ఉత్పత్తులు అందుబాటులో ఉంచమన్నారు.

ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ నాణ్యమైన సేవలను అందించి వినియోగదారుల ఆదరణను చూరగొనాలని సూచించారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించి.. దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోదావరి కట్స్ నిర్వాహకులు నిఖిల్ రెడ్డి, నిహల్ రెడ్డి, వాసు, రాజేందర్, ప్రణీత్ లతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు.