
హైదరాబాద్, నిఘా 24 : ఒకే చోట పనిచేస్తున్న ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ… పెళ్లి విషయానికి వచ్చే సరికి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రియుడి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో గత రెండు రోజుల క్రితం ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా, ప్రియుడి మరణవార్త తెలిసిన ప్రియురాలు సైతం ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు… పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ కు చెందిన నేహా(19) గత 8నెలల క్రితం నగరానికి వచ్చింది. గౌలిదొడ్డి జర్నలిస్టు కాలనీలో ఉన్న ఉమెన్స్ హాస్టల్లో నివాసం ఉంటూ నానక్ రాంగూడలోని గోల్ఫ్ ఎడ్జ్ ఆవరణలో ఉన్న బరిస్టా బేకరీలో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది. ఇదే బేకరీలో బాలాపూర్ ప్రాంతంలోని వెంకటాపురంలో నివాసం ఉండే సల్మాన్ సైతం ఉద్యోగం చేస్తున్నాడు. ఒకే సంస్థలో పనిచేస్తున్న నేహా, సల్మాన్ల మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. వీరి ప్రేమ విషయం తెలిసి బరిస్టా బేకరీ యాజమాన్యం సల్మాన్ ను ఉద్యోగం నుంచి తొలగించింది.
మరోవైపు నేహాతో ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పిన సల్మాన్ పెళ్లి చేసుకునేందుకు పెద్దల అనుమతి కోరాడు. వీరి ప్రేమ పెళ్లికి సల్మాన్ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మనస్థాపానికి గురైన సల్మాన్ అక్టోబరు 1వ తేదీన తాన ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియుడి ఆత్మహత్య విషయం రెండు రోజుల తరువాత మంగళవారం తెలుసుకున్న నేహా తీవ్ర మనస్థాపం చెందింది. తాను ఉంటున్న జర్నలిస్టు కాలనీలోని హాస్టల్ గదిలో ఉరివేసుకుని మంగళవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. ఒకేచోట పనిచేస్తున్న ఇద్దరి మధ్య చిగురించిన ప్రేమ… పెద్దలు పెళ్లికి అంగీకరించకపోవడంతో వేరువేరు చోట్ల ఆత్మహత్యలతో విషాదంగా ముగిసింది.
Dear immortals, I need some wow gold inspiration to create.