
శేరిలింగంపల్లి, నిఘా 24 : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి మేడ్లకుంట చెరువులో దోమల నివారణ కోసం జిహెచ్ఎంసి అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిహెచ్ఎంసి ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో సిబ్బంది డ్రోన్ తో దోమల మందును పిచికారీ చేశారు. ఈ పనులను గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో పాటు చెరువు సుందరీకరణ కోసం చేపడుతున్న పనులను పరిశీలించారు. మేడ్లకుంట చెరువును కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి దత్తత తీసుకొని స్వచ్ఛంద సంస్థ సహకారంతో అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ దోమల బెడదపై కాలనీ వాసులు, చెరువు చుట్టూ ప్రక్కన నివాసం ఉంటున్న ప్రజల విజ్ఞప్తి డ్రోన్ యంత్రంతో దోమల మందు పిచికారీ చేయిస్తున్నట్లు చెప్పారు. మన ఇంటితోపాటు చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రముగా ఉంచుకున్నప్పుడే ఎటువంటి రోగాలు దరిచేరవన్నారు. పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి సూపర్వైజర్ విశ్వా ప్రసాద్, నర్సింహులు, యాదగిరి, తిమోతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
